తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 9am
టాప్​టెన్​ న్యూస్​@9AM

By

Published : Feb 25, 2021, 9:03 AM IST

మరో మైలురాయి

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరో మైలురాయిని దాటింది. ఈ పథకంలో భాగంగా నిర్మించిన గాయత్రి పంపుహౌస్‌ నుంచి మధ్యమానేరు జలాశయానికి నిన్నటికే వంద టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పోటెత్తిన భక్తజనం

వాగులో పుణ్య స్నానాలు.. శివసత్తుల పూనకాలు.. నెత్తిన బంగారంతో.. తల్లీ సల్లంగచూడు.. కరుణించి కాపాడమ్మా.. అంటూ మేడారం అంతా సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమోగింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం నుంచి మండమెలిగే(చిన జాతర) ఘనంగా ప్రారంభమైంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చంపేశాడు..

ప్రేమ త్యాగం కోరుతుంది. కానీ ఇక్కడ మరో ప్రాణాన్ని కోరింది. వారిద్దరూ రైతుబిడ్డలే. ఇద్దరూ ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. క్షణికావేశంలో అతడు ఆమె గొంతుకు చున్నీ బిగించి హతమార్చాడు. అనంతరం నేరుగా పోలీసు స్టేషన్​కు వెళ్లి లొంగిపోయాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తెలంగాణ టాప్

ఈ ఏడాది వర్షాలు సమృద్ధి కురవటంతో తెలంగాణలో వరి సాగు భారీగా పెరిగింది. ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌ వరి సాగు విస్తీర్ణంలో దేశంలోకెల్లా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

తరగతుల వారీగా తిరిగి స్కూళ్లను తెరుస్తున్నాయి పాఠశాల యాజమాన్యాలు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం కోసం, వైరస్‌ నుంచి వారికి పూర్తి రక్షణ కల్పించే చర్యలను చేపడుతున్నాయి. అయితే స్కూల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పిల్లల్ని కూడా కొన్ని విషయాల్లో అలర్ట్‌గా ఉంచమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు నిపుణులు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బాదుడు

సబ్సిడీ గ్యాస్​ సిలిండర్​పై​ ధరను రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు.. బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నాయి. దీంతో గృహ వినియోగ సిలిండరు ధర రూ.846.50కు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పుదుచ్చేరి, తమిళనాడులో గురువారం పర్యటించనున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితమివ్వనున్నారు. పుదుచ్చేరిలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అన్వేషణ

కుజ గ్రహాన్ని ఒకప్పుడు వాతావరణం ఆవరించి ఉండేదనీ, అక్కడ నీరు కూడా ఉండేదని శాస్త్రజ్ఞుల అంచనా. భూమి తరవాత మానవునికి కుజ గ్రహమే నివాసయోగ్యమవుతుందని వారు భావిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దాటేసిన అశ్విన్

భారత స్పిన్నర్​ అశ్విన్​ తాజాగా మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టెస్టులో మూడు వికెట్లు తీసిన యాష్​.. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్​గా నిలిచాడు. తాజాగా అతడు జహీర్​ ఖాన్​ను అధిగమించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఎదురు చూస్తున్నా

ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా యువ కథానాయకులు కొత్తగా అడుగులు వేస్తున్నారు. కొత్త కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ప్రేమకథలకి పెట్టింది పేరైన యువ కథానాయకుడు నితిన్‌ కూడా 'చెక్‌'తో అలాంటి ప్రయత్నమే చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details