తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @5PM - ts news in Telugu

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 5pm
టాప్​టెన్​ న్యూస్​@5PM

By

Published : Feb 8, 2021, 4:56 PM IST

1. శంకుస్థాపన

రాష్ట్రంలో 4 రకాల విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. విప్లవాలతో గ్రామీణ ఆర్థిక జీవనంలో మార్పు వచ్చిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్మాలలో ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​కు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2. భార్యల దేహశుద్ధి

రెండు పెళ్లిళ్లు చేసుకున్న భర్తకు భార్యలు దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది. 22 ఏళ్ల క్రితం ధనలక్ష్మిని పరశురాము అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ధనలక్ష్మి, పరశురాము దంపతులకు ముగ్గురు సంతానం. కొంతకాలంగా పరశురాము ఇంటికి రాకపోవడం వల్ల... అనుమానంతో ధనలక్ష్మి కూపిలాగింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3. కొనసాగుతున్న పాదయాత్ర

రేవంత్​రెడ్డి పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ఈ పాదయాత్ర ఉప్పునుంతల నుంచి డిండి చింతలపల్లి వరకు 10 కిలోమీటర్లు సాగనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4. శ్రీధర్ బాబు అలక..

పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇదే సమయంలో ప్రొటోకాల్​ పాటించలేదని స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5. పునర్విభజన బిల్లుకు ఆమోదం

జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ)-బిల్లు 2021.. రాజ్యసభలో సోమవారం ఆమోదం పొందింది. దీంతో జమ్ముకశ్మీర్ కేడర్​కి చెందిన సివిల్​ సర్వీసు అధికారులు అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెరిటరీ (ఆగ్ముత్​) పరిధిలోకి రానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6. రూటు మార్చిన భాజపా

బంగాల్​లో భాజపా చేపట్టిన పరివర్తన యాత్రను ముర్షీదాబాద్ జిల్లాలో పోలీసులు అడ్డుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలున్నందున భాజపా ప్రచార రథాన్ని బెల్దంగాలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. దీంతో ప్రత్నామ్నాయ మార్గం ద్వారా రథయాత్రను కొనసాగించారు భాజపా నాయకులు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7. ఖాతాలు బ్లాక్ చేయాలని ఆదేశం

రైతుల ఆందోళనపై తప్పుడు ప్రచారం చేస్తోన్న 1,178 ఖాతాలను తొలగించాలని సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ను ఆదేశించింది కేంద్రం. పాకిస్థాన్, ఖలిస్థాన్ వేర్పాటు వాద శక్తులతో సంబంధాలున్న ఈ ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8. ఆల్​టైమ్​ రికార్డ్​

మార్కెట్​లో బుల్ హవా కొనసాగింది. 617 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 192 పాయింట్లు ఎగబాకిన నిఫ్టీ 15,116 వద్ద ముగిసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9. భారత్​ లక్ష్యం 420

టీమ్​ఇండియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో 178 పరుగులకే ఆలౌట్​ అయింది. ఫలితంగా భారత్​ ముందు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10. మరో అప్​డేట్

డార్లింగ్ స్టార్ 'సలార్' అప్​డేట్ వచ్చింది. తొలి షెడ్యూల్​ పూర్తవగా, త్వరలో రెండో షెడ్యూల్​ మొదలు కానుంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్​ నటిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details