తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 1pm
టాప్​టెన్​ న్యూస్​@1PM

By

Published : Feb 26, 2021, 12:59 PM IST

ఆదేశాలివ్వలేం

కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులపై తాము ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ముగ్గురు సిద్దిపేట వాసులు వేసిన పిటిషన్​పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో ఎన్జీటీనే ఆశ్రయించాలని పిటిషనర్​కు సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అరెస్ట్

ఓ వ్యాపారి కిడ్నాప్‌ కేసును హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీసులు గంటల వ్యవధిలో చేధించారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించిన కిడ్నాపర్లను సాంకేతికత ఆధారంగా పట్టుకుని అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చావులో ఒకటయ్యారు

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పకోకపోటంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో పెద్దచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పనుల్లో వేగం

యాదాద్రిలో భక్తులకు సదుపాయాలు కల్పించే దిశగా యాడా అడుగులు వేస్తోంది. ప్రధాన ఆలయంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభువులను దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మోగనున్న నగారా

శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఎన్నికల సంఘం సమావేశంకానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రూపాయికే చదువు!

పదవీ విరమణ పొందిన తర్వాత ఎవరైనా కాలక్షేపం చేస్తూ హాయిగా గడుపుతారు. కానీ బిహార్​కు చెందిన ఓ ఉపాధ్యాయుడు అలా కాదు. టీచర్‌గా ఉద్యోగం చేసినప్పుడు ఎంతో మందిని భావిపౌరులుగా తీర్చి దిద్దిన ఆయన.. వృద్ధాప్యంలోనూ అదే పనిని కొనసాగిస్తున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భారత ఆర్థికవేత్త

ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్​ సెక్రటరీ జనరల్​గా భారత ఆర్థికవేత్త లిజియా నోరోన్హాను నియమించారు ఆంటోనియో గుటేరస్​. యూఎన్​ఈపీ న్యూయార్క్​ కార్యలయ అధిపతిగానూ ఆమెను ఎంపిక చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కుదేలు

స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1,460 పాయింట్లకుపైగా నష్టంతో 49,574 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 430 పాయింట్లు కోల్పోయి 14,670 వద్ద కొనసాగుతోంది. ఈ స్థాయి నష్టాలు ఇటీవలి కాలంలో ఇదే ప్రథమం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దెయ్యాలేం లేవు

ఇంగ్లాండ్​తో మూడో టెస్టులో భారత్‌ కూడా తప్పులు చేసిందన్నాడు టీమ్​ఇండియా స్టార్ బ్యాట్స్​మన్ రోహిత్ శర్మ. పిచ్​ పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితే పరుగులు రాబట్టొచ్చని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఎలా వచ్చిందంటే!

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​ హీరోగా అరంగేట్రం చేసిన 'చిరుత' సినిమాలో హాస్యనటుడు అలీ పోషించిన 'నచ్చిమి' పాత్ర అందర్ని ఆకట్టుకుంది. అయితే ఆ కథ అనుకున్నప్పుడు అలీకి దర్శకుడు పూరీ జగన్నాథ్​ ఎలాంటి పాత్ర రాయలేదట. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details