తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ @1PM - top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 1pm
టాప్​టెన్​ న్యూస్@1PM

By

Published : Feb 24, 2021, 12:58 PM IST

చివరికి ఇలా..

మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌లో కిడ్నాప్‌ నాటకమాడిన ఫార్మసీ విద్యార్థి(19)ని ఆత్మహత్యకు పాల్పడింది. నిద్ర‌ మాత్రలు మింగి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తరలొచ్చిన భక్తులు

గిరిజను ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క, సారలమ్మ చిన జాతర ప్రారంభమైంది. అమ్మవార్లు దర్శనానికి తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్​గ​ఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఒకే ఫోన్​ నంబర్​... 72 పాస్​పోర్టులు...

నిజామాబాద్​ జిల్లాలోని బోధన్‌ పట్టణంలో ఓ ఇంటి నంబరుపై 37.. మరో ఇంటి చిరునామాతో 19 పాస్‌పోర్టులు మంజూరయ్యాయి. ఇందులో 35 పాస్‌పోర్టుల దరఖాస్తుల్లో ఒకే చరవాణి నంబరు దాఖలై ఉంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఎన్​కౌంటర్

జమ్ముకశ్మీర్​ అనంతనాగ్​లో ఎన్​కౌంటర్​ జరిగింది. బలగాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు ఆపరేషన్​ నిర్వహించాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

లైవ్​ వీడియో

బెంగళూరు నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొట్టగా ఇద్దరు యువకులు మరణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య

కుటుంబ కలహాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

పాత పద్ధతే

అమెరికా పౌరసత్వం ప్రక్రియకు సంబంధించి గతేడాది అమలులోకి వచ్చిన విధానాన్ని అధ్యక్షుడు బైడెన్ రద్దు చేశారు. ఆ స్థానంలో ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన విధానాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సాంకేతిక లోపం

సాంకేతిక సమస్యలతో ఎన్​ఎస్​ఈ సూచీల లైవ్​ ధరల అప్​డేట్ ఆగిపోయింది. ఈ విషయంపై వివిధ బ్రోకరేజీలు తమ వినియోగదారులకు సమాచారమిచ్చాయి. ఎన్​ఎస్​ఈ మాత్రం ఇంకా ఈ విషయంపై ప్రకటన చేయలేదు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మొతేరా ప్రారంభం

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, కేంద్రమంత్రి అమిత్​ షా గుజరాత్​లోని మొతేరా క్రికెట్​ స్టేడియాన్ని ప్రారంభించారు. మొతేరాలో మధ్యాహ్నం 2.30 గం.కు భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తప్పుకున్న విక్రమ్!

భారీ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న 'మహావీర్‌ కర్ణ' సినిమా నుంచి చియాన్​ విక్రమ్​ తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆయన పాత్రకు ఓ బాలీవుడ్​ నటుడిని తీసుకునే యోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలిసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details