తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 1PM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news for 1pm
టాప్​టెన్​ న్యూస్​@1PM

By

Published : Feb 17, 2021, 1:00 PM IST

కేసీఆర్​ ఒక యోధుడు

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. అనంతరం కాళేశ్వరం, తెలంగాణ గల్లీ నుంచి దిల్లీ పాటల సీడీలు ఆవిష్కరించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కోటి వృక్షార్చన

ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 'కోటి వృక్షార్చన' నిర్వహిస్తున్నారు. సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, హైదరాబాద్​ నాగల్​లో ఎంపీ సంతోష్​ కుమార్​ మొక్కలు నాటారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కొనసాగుతున్న పోలింగ్​

ఏపీలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్​ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్​ కొనసాగుతుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చిన్నారితో సహా

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లిలో విషాదం నెలకొంది. చిన్నారితో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలతో చిన్నారితో సహా మంగళవారం మహిళ చెరువులో దూకింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అరెస్ట్

జనవరి 26న దిల్లీలో హింసకు సంబంధించి పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్​ చేశారు. ఎర్రకోట వద్ద అతడు కత్తి తిప్పుతూ నిరసనకారులను ప్రేరేపించాడని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

చనిపోయి బతికాడు

అతడు చనిపోయాడనుకున్నారు. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. 11వ రోజు కర్మకాండలకు సిద్ధమయ్యారు. ఒక్కసారిగా ఆ వ్యక్తి వారి ముందు ప్రత్యక్షమయ్యారు. దాంతో ఒకింత భయానికి, ఆశ్చర్యానికి గురయ్యారు ఆ కుటుంబ సభ్యులు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

31 ఏళ్ల తర్వాత

కశ్మీర్​లో ఉగ్రవాదం, వలసల కారణంగా మూడు దశాబ్దాలుగా మూతపడిన ఓ హిందూ ఆలయం మంగళవారం తిరిగి తెరుచుకుంది. స్థానిక ముస్లిం ప్రజల సహకారంతో ఆలయం పునఃప్రారంభం కావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మళ్లీ జెఫ్​ బెజోస్​

ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా జెఫ్​ బెజోస్​ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఆరు వారాలుగా ఈ స్థానంలో కొనసాగుతున్న ఎలాన్​ మస్క్ సంపద భారీగా తగ్గడం వల్ల బెజోస్​ అగ్రస్థానానికి ఎగబాకారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గుడ్​బై...

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్​ ఫాఫ్​ డుప్లెసిస్​ బుధవారం టెస్టు క్రికెట్​కు వీడ్కోలు పలికాడు. సుదీర్ఘ ఫార్మాట్​కు గుడ్​బై చెబుతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​లో డుప్లెసిస్​ ఓ భావోద్వేగపు పోస్ట్​ ద్వారా వెల్లడించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సర్​ప్రైజ్!

సూపర్​స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్​డేట్ ఇచ్చేందుకు సిద్ధమైంది చిత్రబృందం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details