ఖమ్మం జిల్లాలో దారుణం. వైరా సంత బజారులో వృద్ధ దంపతుల ఆత్మహత్య. విష ద్రావణం తాగి జగన్నాథచారి(80), వెంకట్రావమ్మ(70) బలవన్మరణం చెందారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
జూరాల జలాశయంలో బుధవారం రెండు మృతదేహాలు.. తాజాగా గురువారం మరో మృతదేహం లభ్యమైంది. ఇంకో పాప కోసం వెతుకుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
హైదరాబాద్ నగరంలో కార్పొరేట్ ఆస్పత్రుల ఆగడాలకు.. అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వచ్చిన.. వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి చెందటంతో ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
భారత్‌లో కరోనా విజృంభణ నానాటికీ పెరిగిపోతోంది. దేశంలో కొత్తగా 69,652 కేసులు నమోదవ్వగా... మరో 977 మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 28,36,926కు చేరింది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కరోనా టీకాను పరిశీలిస్తాం'
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ అనుమతులపై కీలక వ్యాఖ్యలు చేసింది ఐసీఎంఆర్. దేశీయంగా రూపొందించిన రెండు టీకాలు రెండో దశ ప్రయోగ పరీక్షలు పూర్తి కావచ్చాయని.. ప్రభుత్వం నిర్ణయిస్తే వ్యాక్సిన్‌కు అత్యవసరంగా ఆమోదాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కాంగ్రెస్ అధ్యక్షలుగా గాంధీలు తప్పా...
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. గాంధీ కుటుంబానికి చెందని వ్యక్తులే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారని.. ఓ పుస్తకం కోసం ఏడాది క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. కొత్తగా 2 లక్షల మందికి పైగా వైరస్ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 2.26 కోట్లకు, మరణాలు 8 లక్షలకు చేరువయ్యాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, రష్యాల్లో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మూడు రోజుల జోరుకు బ్రేక్..
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు గురువారం బ్రేక్ పడింది. బీఎస్ఈ-సెన్సెక్స్ 340 పాయింట్లకుపైగా పడిపోయి 38,270 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 102 పాయింట్లకుపైగా నష్టంతో 11,306 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఆటతీరు మెరుగుపురుచుకోవాలి
క్రికెట్లో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా తన ఆటతీరు మెరుగుపరుచుకోవాలని అంటున్నాడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ లబుషేన్. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సాధన చేస్తున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ప్రభాస్ సరసన కీర్తి సురేశ్!
డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రంలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనువిందు చేయనున్నాడని సమాచారం. కాగా సీత పాత్ర కోసం హీరోయిన్ కీర్తి సురేశ్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి