తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@11AM - TOP NEWS AT 11 AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS AT 11 AM
టాప్​టెన్​ న్యూస్​@11AM

By

Published : Aug 19, 2020, 11:00 AM IST

  • ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లాలో మోటకొండూరులో విషాదం. ఒకే ఇంటిలో ఉరేసుకుని మామ భర్తయ్య(60), కోడలు మానస(27) ఆత్మహత్య పాల్పడ్డారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • లారీని ఢీకొన్న అంబులెన్స్​... ఇద్దరు మృతి

ఆరోగ్యం సరిగా లేదని... మెరుగైన చికిత్స తీసుకునేందుకు ఏపీ నుంచి హైదరబాద్​ బయలుదేరాడు ఓ వ్యక్తి. అతనికి తోడుగా కుమారుడిని సైతం తీసుకుని అంబులెన్స్​లో నగరానికి పయనమయ్యాడు. ఆరోగ్యం కుదుటపడితే ఇంటికి వద్దామనుకున్న వారిని మృత్యువు వెంటాడింది. అంబులెన్స్​ డ్రైవర్​ నిర్లక్ష్యంతో ఆ తండ్రి కొడుకు ప్రాణాలు విడిచారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • చెరువులోకి చేపలవేటకు వెళ్లి ఇద్దరు గల్లంతు

మెదక్‌ జిల్లాలో చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి పెద్ద చెరువులోకి చేపలవేటకు వెళ్లిన ఇద్దరు గల్లంతయ్యారు. చెరువులో ఒకరి మృతదేహం లభించగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయ్ండి

  • వాడకున్నా మోతే.. ఖాళీ ఫ్లాటుకు రూ.48,316 కరెంట్ బిల్లు

రూ.వేలు, రూ.లక్షల్లో వస్తున్న కరెంటు బిల్లులు చూసి సామాన్యులు షాకవుతున్నారు. మీటర్లలో సాంకేతిక లోపాలు వినియోగదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. వినియోగానికి మించి రీడింగ్‌ తిరుగుతున్నాయి. ప్రతి నెల వందల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మీటర్‌ రీడింగ్‌ ఆలస్యం పైన ఫిర్యాదులొస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • దేశంలో కరోనా పంజా

భారత్​లో అంతకంతకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 64,531 కేసులు నమోదవ్వగా... మరో 1,092 మృతి చెందారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 27 లక్షల 67 వేలు దాటింది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన చిరుత

మహారాష్ట్ర నాసిక్​లోని ఇగత్​పురి ప్రాంతంలో.. చిరుత నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అవన్నీ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నాయి. స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • బైడెన్​ను అధికారికంగా నామినేట్ చేసిన​ డెమొక్రటిక్​ పార్టీ

జో బైడెన్​ను అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా అధికారికంగా నామినేట్​ చేసింది డెమొక్రటిక్​ పార్టీ. దీంతో ఆయన నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను ఢీకొట్టనున్నారు. డెమెుక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్​ను ఎంపిక చేసుకున్నారు బైడెన్​. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఇంగ్లాండ్​-పాక్​: టీ20ల్లో టెస్టు ప్లేయర్లకు దక్కని చోటు

ఇంగ్లాండ్-పాకిస్థాన్​ మధ్య త్వరలో టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. ఇందుకోసం 14 మందితో జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్​ బోర్డు. ఇప్పటికే మూడో మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్​ సేన. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • మోహన్​లాల్​ కొడుకుతో కల్యాణి ప్రియదర్శన్​ ప్రేమాయణం!

మలయాళ హీరో మోహన్​లాల్​ తనయుడు ప్రణవ్​, హీరోయిన్​ కల్యాణి ప్రియదర్శన్​ ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరూ ప్రస్తుతం లవ్​బర్డ్స్​గా మారారని సినీవర్గాలు అంటున్నాయి. ఇద్దరూ కలిసి ప్రస్తుతం 'హృదయం' అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details