తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 1PM - తెలంగాణ వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS AT 1 PM
టాప్​టెన్​ న్యూస్​@ 1PM

By

Published : Aug 20, 2020, 1:01 PM IST

  • అనిశా వలలో మరో అధికారి

రంగారెడ్డి జిల్లాలో అ.ని.శా. వలలో మరో అధికారి పట్టుబడ్డారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సూపరింటెంటెండ్​ వెంకటేశ్వర్‌రెడ్డి రూ.5 వేల లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా అధికారులకు దొరికిపోయారు. భూమి కొలతల రిపోర్టు ఇవ్వడానికి అతను రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్టు వెల్లడించారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • మరో రెండు రోజులు వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • బస్సు సర్వీసులు రద్దు..

భద్రాచలం డిపో నుంచి ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. పాల్వంచలోని నాగారం కిన్నెరసాని వంతెన వద్ద రహదారి ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో భద్రాచలం నుంచి నడుస్తున్న పలు బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • ఎవరి ఇళ్లల్లో వారే పండుగలు జరుపుకోవాలి

కొవిడ్ నిబంధనల మేరకు వినాయక చవితి, మొహర్రం జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి అందరూ సహకరించాలని సూచించారు. ఎవరి ఇళ్లలో వారే భక్తి శ్రద్ధలతో జరుపుకుందామన్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • సరికొత్త చీర.. కరోనా రాదంట!

మధ్యప్రదేశ్‌ చేనేత కళాకారులు ఓ అద్భుతం సృష్టించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న పరిస్థితుల్లో సొగసరి చీరలకు అదనపు సొబగులను అద్దారు. ఔషధగుణాలను పొదువుతూ తీర్చిదిద్దిన ఆ చీరలను ధరిస్తే వ్యాధి నిరోధక శక్తిని శరీరానికి అందిస్తాయట. ఈ నెల 30 నుంచి హైదరాబాద్‌లోనూ విక్రయాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆ చీరల విశేషాలేంటో తెలుసుకుందాం.

  • ఫేస్​బుక్​లో దర్శనం- గూగుల్​లో హారతి

కరోనా కారణంగా ఈసారి గణేశ్​ ఉత్సవాలు పూర్తిగా కళ తప్పాయి. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా దర్శనాలను వీక్షించేందుకు మండపాల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఫేస్​బుక్​లో లైవ్​ దర్శనాలు.. గూగుల్​, జూమ్​లో హారతి ప్రత్యక్ష ప్రసారానికి సన్నద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • 'ఒబామా పనికిరాలేదు కాబట్టే నేను గెలిచా'

అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికా రాజకీయాలు వేడేక్కుతున్నాయి. అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరారని మిషెల్లీ ఒబామా చేసిన విమర్శకు.. కౌంటర్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. నిజానికి ఒబామా అధ్యక్షుడిగా పనికిరాకుండాపోయారు కాబట్టే ప్రజలు తనకు పట్టం కట్టారని తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • పెట్రో మంటలు..

చమురు ధరలను వరుసగా ఆరో రోజూ పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధన ధరలను సవరించాయి. దీంతో దిల్లీ సహా ఇతర మెట్రో నగరాల్లో లీటర్​ పెట్రోల్ ధర 9 నుంచి 11 పైసల మేర పెరిగింది. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.

  • ధోనీలాంటి కెప్టెన్ మాకు ఉంటే బాగుండు

టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్​పై స్పందించాడు పాకిస్థాన్ జట్టు మాజీ వికెట్ కీపర్ కమ్రన్ అక్మల్. అలాంటి గొప్ప సారథికి సచిన్​లాగా ఘనమైన వీడ్కోలు లభించాలని తెలిపాడు. అతడిలాంటి కెప్టెన్​ భవిష్యత్​లో పాక్​ జట్టుకు ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

  • స్విమ్​సూట్​లో ​ రాహుల్​ ప్రేయసి!

టీమ్ఇండియా ఓపెనర్​ కేఎల్​ రాహుల్​తో బాలీవుడ్​ నటి అతియా శెట్టి ప్రేమాయణం సాగిస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ, వీటిపై వారిద్దరి నుంచి ఎలాంటి స్పందన లేదు. సోషల్​మీడియాలో రాహుల్​, అతియ పోస్టులను చూసి ఆ వార్తలు నిజమేనని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.పూర్తి వివరాలకై క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details