- పార్టీలో అంతర్గత విభేదాలు... ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. కులాలు వారీగా, వర్గాల వారీగా పార్టీలో కుంపటి రగులుతోంది. ఒక వర్గం సభ్యులు పీసీసీ అధ్యక్షుడికి తెలియకుండానే పోలీసు కేసులు పెట్టగా... మరో వర్గం వారు పార్టీ కోర్ కమిటీ సమావేశం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నారు.పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ సెప్టెంబరులోనే!
ఎంసెట్ సహా ప్రవేశపరీక్షలన్నీ సెప్టెంబరులోనే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. జేఈఈ మెయిన్, నీట్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రవేశ పరీక్షలకు అభ్యంతరం చెప్పదని అధికారులు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గినా జోరుగా ఆదాయం
రాష్ట్రంలో జులై నెలలో మద్యం అమ్మకాలు తగ్గినా ఆదాయం మాత్రం తగ్గలేదు. సుమారు రూ.2,507 కోట్ల మద్యం... దుకాణాలకు సరఫరా అయింది. మద్యం ధరలు పెరగడంతోపాటు పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సరకు తరలిపోతుండటం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- కూతురు నగ్న చిత్రాలు తీసిన తండ్రి... నిందితుడు అరెస్ట్
''నీకు భార్య చనిపోతే మా అమ్మను పెళ్లి చేసుకుని తనకు కొత్త జీవితం ఇచ్చావు. నన్ను ప్రేమగా చూసుకున్నావ్. తండ్రి లేని లోటును నువ్వే తీర్చావు. కొండంత ధైర్యంగా అండగా నిలిచావు. నాకు ఏ ఆపద వచ్చినా నన్ను రక్షిస్తావనే భరోసాను ఇచ్చావు. కానీ... నువ్వేందుకు ఇలా చేశావు నాన్న. నీ ల్యాప్‌టాప్‌లో నా చిత్రాలు చూడగానే నాకు భయం వేయలేదు. నువ్వేనా ఇలా చేసింది అని బాధ వేసింది.'' - ఓ కూతురి మనోవేదన పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- ఓబుళాపురం ప్రాంతంలో ఇనుప ఖనిజం లీజుకు పర్మిట్లు
ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం ప్రాంతంలో ఇనుప ఖనిజం లీజుకు గనుల శాఖ అధికారులు పర్మిట్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర లీజులకు కూడా అధికారులు అప్పటి నుంచి పర్మిట్లు జారీ చేయడం లేదు. శ్రీ సాయి బాలాజీ మినరల్స్‌కు మాత్రం రెండు వారాల కిందట క్రితం పర్మిట్ జారీ చేశారు. పూర్తి వివరాలకై క్లిక్ చేయండి
- మరింత క్షీణించిన ప్రణబ్ ఆరోగ్యం