తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @3PM - top 10news till 3pm

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top 10 news till 3pm
టాప్ 10 న్యూస్ @3PM

By

Published : Jun 3, 2020, 3:07 PM IST

కేసీఆర్​కు కిషన్​రెడ్డి లేఖ

హైదరాబాద్​ అంబర్​పేట ప్రధాన కూడలి నుంచి నిర్మించే నాలుగు లైన్ల వంతెన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ రాశారు. ఏమి రాశారంటే..?

నిమ్స్‌లో కరోనా...

హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. కార్డియాలజీ విభాగంలో పనిచేసే ముగ్గురు సిబ్బందికి, నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. అధికారులుఏం చర్యలు తీసుకున్నారంటే..?

లంకె బిందెలు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఎర్రగడ్డపల్లిలో గుప్త నిధుల కలకలం రేగింది. యాకూబ్అలీ అనే వ్యక్తి తన పొలం చదును చేస్తుండగా లంకె బిందెలు బయటపడ్డాయి. నిధుల విషయమై పొలం యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. యజమాని ఏమన్నాడంటే..?

తీరాన్ని తాకింది

మహారాష్ట్రలోని అలీబాగ్​ వద్ద నిసర్గ తుపాను తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో గుజరాత్​ కూడా తుపాను ధాటికి ప్రభావితమవుతోంది. అధికారులు ఎలాంటి సహాయక చర్యలు తీసుకుంటున్నారంటే?

' మీరు చెప్పగలరా?'

భారత్​-చైనా సరిహద్దులో పరిస్థితిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మరోసారి డిమాండ్​ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. భారత భూభాగంలోకి ఒక్క చైనా సైనికుడు కూడా ప్రవేశించలేదని చెప్పగలరా? అంటూ మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంకేమి అడిగారంటే..?

మూడుకిలోమీటర్లు

అనారోగ్యంతో చనిపోయిన ఓ మహిళ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మూడు కిలోమీటర్లలో ఉన్న ఇంటికి మోసుకెళ్లిన ఘటన కర్ణాటక చిక్కమగలూరులో జరిగింది. దీనిపై స్థానికులు ఏమంటున్నారంటే.?

ఒంట్లో సత్తువే లేదు..

ఓ తల్లిని కుమారుడు బండ్లో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ అతను ఎందుకలా చేశాడు?

ఏనుగు చేసిన తప్పు అదే..

మనిషికి మాత్రమే వచ్చిన విద్య నమ్మించి మోసం చేయడం.. అది సాటి మనిషినైనా.. నమ్మిన జంతువునైనా.. ఇలా మనుషులని నమ్మి... ఓ ఏనుగు నిలుచున్నచోటే ప్రాణం కోల్పోయింది. అసలేం జరిగిందంటే...

'అవన్నీ పుకార్లే'

'చంద్రముఖి 2' చిత్రంలో అవకాశం వచ్చినట్లు వస్తోన్న వార్తలపై స్పందించారు నటి సిమ్రాన్​. ఈ ప్రాజెక్టులో తాను భాగస్వామ్యం కాలేదని.. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు. ఏమి క్లారిటీ ఇచ్చారంటే..

ABOUT THE AUTHOR

...view details