తెలంగాణ

telangana

By

Published : May 13, 2021, 10:57 AM IST

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top 10 news till today
టాప్​టెన్​ @11

లాక్​డౌన్​ 2.0: రెండో రోజు అమల్లోకి

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 2.0 రెండో రోజు అమల్లోకి వచ్చింది. లాక్​డౌన్ సడలింపు నాలుగు గంటలే ఇవ్వడంతో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో జనాలు ఉదయమే మార్కెట్లకు వెళ్లి కూరగాయలు, దుకాణాలకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకున్నారు. అనంతరం మార్కెట్లు, దుకాణాలు మూతబడ్డాయి. పోలీసులు చెక్​పోస్టులు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సొంతూళ్లకు పయనం

లాక్​డౌన్​ 2.0 నేపథ్యంలో రాజధానిలో గురువారం ఉదయం నుంచే రహదారులపై జనం రద్దీ నెలకొంది. లాక్‌డౌన్ సడలింపు దృష్ట్యా నగరవాసులు బయటకు వస్తోన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాల రద్దీ ఏర్పడింది. నగరంలో మార్కెట్లు, దుకాణాల వద్ద బారులుతీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోదాడలో భారీ ట్రాఫిక్ జామ్

లాక్‎డౌన్ నేపథ్యంలో కోదాడ పట్టణంలో తెల్లవారుజాము నుంచే రోడ్లన్ని రద్దీగా మారాయి. ఉదయం 10 గంటల వరకే సడలింపు ఉండటంతో.. వ్యాపారులు దుకాణాలు తెరిచారు. దీంతో కొనుగోలుదారులు.. నిత్యావసరాల కోసం ఎగబడ్డారు. ఫలితంగా వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోయాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

18ఏళ్ల లోపు వారిపై ట్రయల్స్​..

2 నుంచి 18 ఏళ్ల వయసు వారిలో రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి కొవాగ్జిన్​కు అనుమతి లభించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ సిఫార్సులను డ్రగ్స్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్తగా 3.62లక్షల కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 3.62 లక్షల కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. కానీ మరణాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. తాజాగా 4,120మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వేడి నీళ్ల స్నానంతో.. కరోనా రాదా?

వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది. వేడి నీళ్ల స్నానం, వేడి నీళ్లను తాగడం ద్వారా శరీరానికి ఉపశమనం లభిస్తుందన్న మాట వాస్తవమే అని కానీ.. వీటి వల్ల కరోనా రాదన్నది నిజం కాదని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గాజాపై ఇజ్రాయెల్​ సైనిక దాడి​

ఇజ్రాయెల్​ పాలస్తీనా మధ్య ఉద్రిక్తత వాతావరణం పెరుగుతోంది. గురువారం తెల్లవారుజామున గాజాపై సైనిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్​. హమాస్​కు చెందిన 10మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్​ చేసిన దాడుల్లో మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆర్థిక రికవరీకి సవాళ్లు

ఆత్మనిర్భర్‌ పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందకముందే భారత్‌పై కొవిడ్‌ రెండో దశ విరుచుకుపడింది. మొదటి దశ ముగిశాక భారత్‌ వేగంగా కోలుకొంటోందని భావిస్తూ మన వృద్ధిరేటు ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన ఆర్థికవేత్తలు, రెండోదశ విజృంభణతో తమ అంచనాలను తగ్గించేశారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పెంచుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించాలంటే కేంద్రం మరిన్ని చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


దేవుడా.. దయ చూపించు

ప్రతి ఒక్కరూ మాస్క్​లు ధరించి సురక్షితంగా ఉండాలని సూచించాడు టీమ్​ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. దేశంలో కొవిడ్​ ఉద్ధృతి చూసి భావోద్వేగానికి గురయ్యాడు. "దేవుడా కాస్త దయ చూపించు" అని ట్వీట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


నేడు సన్నీ లియోనీ బర్త్ డే

జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ హాట్ గర్ల్ సన్నీ లియోనీ. ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్​ను కుటుంబంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈరోజు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details