తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@3PM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top-10-news-till-now-3pm
టాప్​ 10 న్యూస్​@3PM

By

Published : May 23, 2020, 2:48 PM IST

Updated : May 23, 2020, 2:58 PM IST

మరో మారు..

వరంగల్​ గొర్రెకుంట బావి ఘటనపై ఆరు బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. మరోమారు గొర్రెకుంటలో ఫోరెన్సిక్​ బృందం నమూనాలను సేకరించారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు

ఏపీలో విజృంభణ

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు.ఆ వివరాలు

జగన్​కు రాయలసీమ నేతల లేఖ

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డి సహా మొత్తం 16 మంది నేతలు లేఖ రాశారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించాలని కోరారు. ఇంకా ఏమి పేర్కొన్నారంటే...

కొండ చిలువకు 20 కుట్లు

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని జంతుప్రదర్శనశాలలో గాయపడిన కొండచిలువ కోలుకుంటోంది. నాలుగురోజుల క్రితం గాయపడిన చిలువకు మొత్తం 20 కుట్లు వేశారు. అది ఎప్పుడు కోలుకుంటుందంటే...

86కు చేరిన మృతులు

అంపన్‌ తుపాను బంగాల్​ రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. రాష్ట్రంలో ఈ విపత్తు కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరింది. కరెంటు, మంచినీళ్ల సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ప్రజలు ఏమి చేశారంటే...

పుట్టిన ఆరు రోజులకే కరోనా

కరోనాకు కాస్తైనా జాలి లేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎవ్వరినీ వదలట్లేదు. తాజాగా గుజరాత్​లో ఆరు రోజుల కవల పిల్లలకు సోకిందీ మహమ్మారి. మరిన్ని వివరాలు

వ్యాక్సిన్ ట్రయల్స్​ సక్సెస్

మానవులపై నిర్వహించిన కరోనా వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్స్​ విజయవంతమైనట్లు చైనా పరిశోధకులు తెలిపారు. వైరస్​ను ఎదుర్కొనేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం ఈ వ్యాక్సిన్​కు ఉన్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం

కరోనా 2.0: చైనా

చైనాలో కరోనా వైరస్​ రెండో దశ విజృంభిస్తోంది. ఎలాంటి లక్షణాలు బయటపడని​ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 28 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 25 కేసులు హుబే రాష్ట్రానికి చెందినవేననిచైనా తెలిపింది.

డ్యూయెట్​ చేద్దామా కోహ్లీ

టిక్​టాక్​లో డ్యూయెట్​ చేయడానికి టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీని ఆహ్వానించాడు ఆసీస్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​. తన భార్య అనుష్క శర్మ సహాయంతో టిక్​టాక్​ ఖాతాను తెరవమని సూచించాడు. ఇంకేమన్నాడంటే...

'మళ్లీ అనగానే నవ్వుకున్నారు'

దూరదర్శన్ ఛానెల్​లో మరోసారి ప్రసారమవుతూ ఎన్నో ఘనతల్ని సాధిస్తోంది 'రామాయణ్'. ఈ సీరియల్​ను పునఃప్రసారం చేయడానికి ముందు అనుభవాలను పంచుకున్నారు ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్ వెంపటి. మళ్లీ ప్రసారమంటే నవ్వుకున్నారు.

Last Updated : May 23, 2020, 2:58 PM IST

ABOUT THE AUTHOR

...view details