కూల్ కూల్‌గా...
వేసవి తాపం నుంచి నగరవాసులకు ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటం వల్ల ఎండ వేడిమి నుంచి నగరవాసులకు కాస్త ఊరట లభించింది. మీరు తడిసేయండి..
మిడతలు వస్తున్నాయా?
మిడతల దండు కదలికలపై హైదరాబాద్ నుంచి ప్రత్యేక కమిటీ హెలికాఫ్టర్‌లో ఆదిలాబాద్ చేరుకుంది. అనంతరం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించింది. అధికారులకు ఏమి సూచనలు ఇచ్చిందంటే?
గ్యాంగ్ వార్..
విజయవాడలోని పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గొడవకి కారణాలేంటంటే...
'పార్టీ మారే ఉద్దేశం లేదు.. '
తాను పార్టీ మారుతానని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. తనకు అలాంటి ఉద్దేశం లేదని.. తెదేపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారే అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
వ్యూహం ఏమిటి?
కరోనా మహమ్మారి విజృంభణకు తోడు మిడతల దాడి రాష్ట్రాలను కలవరపెడుతోంది. మిడతల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నారు. మిడతలపై పోరుకు మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రచిస్తోంది?
ఏఎస్ఐ మృతికి అదే కారణమా?
దేశ రాజధాని దిల్లీ పోలీసు విభాగంలో మరొకరు కరోనాకు బలయ్యారు. నేర విభాగంలోని ఫింగర్ ప్రింట్ బ్యూరోతో కలిసి పని చేసిన ఏఎస్ఐ ఒకరు మహమ్మారి బారిన పడి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
''నమస్తే ట్రంప్' వల్లే కరోనా'
కరోనా వ్యాప్తికి నమస్తే ట్రంప్ కార్యక్రమమే కారణమని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు కొంతమంది ప్రతినిధులు ముంబయి, దిల్లీ ప్రాంతాలను సందర్శించారని.. అందువల్లే వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. ఇంకేమన్నారంటే...
నిరసనకారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు
అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో నిరసనలు చేస్తున్న ఆందోళనకారులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. పోలీసు అతి ప్రవర్తనతో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలనే డిమాండ్‌తో రోడ్లపై నిరసన తెలుపుతున్న వారిని ట్రక్కు ఢీకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.
పార్ట్-2తో ముందుకొచ్చిన వార్నర్ జోడీ
'మైండ్‌బ్లాక్' పార్ట్-2 టిక్‌టాక్‌తో అదరగొట్టారు వార్నర్ జోడీ. తొలి వీడియోలో మిస్సయిన ఈ క్రికెటర్ పిల్లలు.. ఇందులో స్పెప్పులు వేస్తూ కనిపించారు. వీడియో మీ కోసం.
'ట్రస్ట్‌లో 21 మందికి కరోనా'
తాను నిర్వహిస్తున్న ట్రస్ట్‌లో 21 మందికి కరోనా రావడం బాధ కలిగించిందని చెప్పారు నటుడు, దర్శకుడు లారెన్స్. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని అభిమానుల్ని కోరారు.వారికిప్పుడు ఎలా ఉందంటే...