తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @1PM - top 10 news till 1 pm

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

top 10 news till 1 pm
టాప్​ 10 న్యూస్ @1PM

By

Published : Jun 3, 2020, 12:59 PM IST

నిమ్స్‌లో కరోనా..

హైదరాబాద్‌ నిమ్స్ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. కార్డియాలజీ విభాగంలో పనిచేసే ముగ్గురు సిబ్బందికి, నలుగురు వైద్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులుఏం చేశారంటే..?

బావా పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆర్థిక మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా తెరాస నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవిత ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏమని ట్వీట్ చేశారంటే...

ముగ్గురు ముష్కరులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా కంగన్​ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ముష్కరులు ఉన్నారన్న కచ్చితమైన సమాచారంతో ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే...?

తరుముకొస్తున్న నిసర్గ..

నిసర్గ తుపాను మరింత ఉద్ధృతంగా మారుతోంది. ఇవాళ మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య అలీబాగ్​కు సమీపంలోని హరిహరేశ్వర్​, డామన్​ల మధ్య తీరాన్ని దాటే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ఏం చేస్తున్నారంటే...

రియల్‌ స్టోరీ

సందీప్‌, పండు... ఇద్దరూ ఒకప్పుడు మిత్రులే. వారి మధ్య.... కాలం కత్తులు దూసింది. గూండాయిజం గ్రూపులు కట్టింది. నువ్వెంతంటే నువ్వెంత అని సవాళ్లు విసిరింది. ఇదేదో రీల్‌ స్టోరీ కాదు.. బెజవాడ గ్యాంగ్‌వార్‌ రియల్‌ స్టోరీ. ఇంతకీ ప్రాణ స్నేహితులు ప్రాణాలు తీసుకునే వరకూ ఎందుకెళ్లారు? ఆ శనివారం ఏం జరిగింది?

మీ పిల్లలూ మంచోళ్లేనా..

కరోనాతో వచ్చిన ఈ లాక్‌డౌన్‌ కారణంగా పిల్లల్లో కొత్త కోణాన్ని గమనించారు తల్లిదండ్రులు. ఇన్నాళ్లూ మంచోళ్లే అనుకున్నా వారు తమకు తెలియకుండా చెడుబాటలో వెళ్తున్నారన్న విషయాలు తెలిసొచ్చాయి. తమ వద్దకు వచ్చే కేసుల్లో 17-21 ఏళ్ల వయసున్న వారే ఎక్కువయ్యాయంటున్నారు నిపుణులు. వారు మారేందుకు పలు సూచనలు చేస్తున్నారు.

సైకిల్​తో సావాసమే నయం!

బస్సు, మెట్రోలో వెళ్దామంటే... కరోనా భయం. అందరూ సొంత వాహనాలే వాడడం మొదలుపెడితే కాలుష్య భూతం కాటేయడం ఖాయం. మరి ఈ సమస్యకు పరిష్కారమెలా? విద్యా సంస్థలకు, కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు సైక్లింగ్​ను ఎంచుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంతకీ ఏ దేశం ఏం చేస్తోంది? ఎంత ఖర్చు పెడుతోంది? భారత్​ పరిస్థితి ఏంటి?

సేవింగ్స్​పై​ వడ్డీ రేటు తగ్గింపు

ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్​లు సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించాయి. ఏప్రిల్​లో 25 బేసిస్​ పాయింట్ల వడ్డీ తగ్గించిన ఎస్​బీఐ తాజాగా మరో 5 బేసిస్ పాయింట్ల కోత విధించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి..

పంజాబీ సాంగ్​లో అమితాబ్​, కరీనా

కరోనాపై అవగాహన కోసం ప్రత్యేక గీతం రూపొందించింది పంజాబ్​ ప్రభుత్వం. ఇందులో బాలీవుడ్​ స్టార్​లు అమితాబ్​ బచ్చన్​, కరీనా కపూర్​ సహా పలువురు సినీ, క్రీడా సెలబ్రిటీలు కనువిందు చేశారు. మీరు చూడండి.

'కోహ్లీ ఫిట్​నెస్​ అదరహో'

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు బంగ్లాదేశ్​ క్రికెటర్​ తమీమ్​ ఇక్బాల్​. కోహ్లీకి ఫిట్​నెస్​పై ఉన్న శ్రద్ధ చూసి ఆశ్చర్యపోయానని వెల్లడించాడు. విరాట్​ చేస్తున్న కసరత్తుల్లో తాను కొంచెం కూడా ప్రయత్నించట్లేదని సిగ్గుపడినట్లు చెప్పుకొచ్చాడు ఇక్బాల్​. ఇంకేమన్నాడంటే...

ABOUT THE AUTHOR

...view details