భాగ్యనగరంపై కరోనా పంజా
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నెల రోజుల నుంచి భారీగా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరగడానికి గల కారణాల గురించి అధికారులు ఇలా చెబుతున్నారు.
మరో ముందడుగు
కరోనా పరిశోధనల్లో ఐఐటీ హైదరాబాద్ కీలక అడుగు వేసింది. అతి తక్కువ ధరలో, స్వల్పకాలంలో స్పష్టమైన ఫలితం వచ్చేలా.. కరోనా నిర్ధరణ కిట్‌ను రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
లోకాన్ని కమ్మేస్తోంది
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎవ్వరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆదివారం నాటికి 70లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. బంగ్లాదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆయా దేశాల్లో పరిస్థితి ఇలా ఉంది.
మహా విజృంభణ
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య 2.46 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 7వేలకు చేరువైంది. కేసులపరంగా మహారాష్ట్ర.. కొవిడ్-19 పుట్టినిల్లు చైనాను దాటేసింది. మొత్తం కేసులు 85వేల దాటాయి. తమిళనాడులో వరుసగా ఎనిమిదో రోజు వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. పూర్తి సమాచారం కోసం ఇక్కడో క్లిక్ కొట్టండి...
అక్కడ 11 మందికి కొవిడ్
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో 11 మంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. అదే కార్యాలయంలో పనిచేస్తోన్న ఇద్దరికి గత వారమే వైరస్ సోకింది. ఫలితంగా రెండు రోజుల పాటు కార్యాలయాలన్ని మూసివేసిన అధికారులు.. శానిటైజింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకీ ఆ11 మంది ఎవరంటే...