తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ ​@ 5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top 10 News @ 5PM
టాప్​ 10 న్యూస్ ​@ 5PM

By

Published : May 22, 2020, 4:59 PM IST

పాకిస్థాన్​ విమానం క్రాష్​!

పాకిస్థాన్​ కరాచీలో ఘోర ప్రమాదం జరిగింది. లాహోర్​ నుంచి కరాచీ వెళ్తుండగా జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర్లో కూలిపోయింది. విమానంలో ఎంతమంది ఉన్నారంటే..?

'ఎవరున్నా కఠిన చర్యలే..!

గొర్రెకుంట బావి ఘటనపై మంత్రి సత్యవతి రాఠోడ్​ విచారం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇవి ఆత్మహత్యలు కాకపోతే... దీని వెనకలా ఎవరైనా ఉన్నట్లయితే కఠిన చర్యలేనని మంత్రి అన్నారు. ఇంకా దీని పూర్తి వివరాలు ఇలా..

మరింత భగభగ

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం మధ్యాహ‌్నం వరకు 45 నుంచి 46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందంటే...?


పదో తరగతి షెడ్యూల్

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8 నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధిని ఇస్తూ షెడ్యూల్​​ను విడుదల చేసింది. పరీక్షల వివరాలు ఇలా...

మోదీ మాట - దీదీ పాట

బంగాల్​లో 'అంపన్' తుపాను​ ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు ప్రధాని మోదీ. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు. అయితే ప్రకృతి విపత్తు కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. అవి ఎన్ని కోట్లంటే..?

'జూమ్'​ బ్యాన్​పై మీరు ఏమంటారు?

వీడియో సమావేశాలకు వేదికగా మారిన 'జూమ్‌' యాప్‌ నిషేధంపై తమ అభిప్రాయం తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇంకా అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?

ప్లీజ్​.. నన్ను నమ్మండి..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ మాస్క్​ వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? సమస్యే లేదు, ఆయన ఇంతవరకు మాస్క్​ ధరించిన సందర్భమే లేదు అంటారా? అయితే ట్రంప్​ తానే స్వయంగా మాస్క్​ ధరించినట్లు ఒప్పుకున్నారు. కానీ అది చూసే భాగ్యం మాత్రం లేదట! ఎందుకంటే..?

మదుపర్లు బేజారు

జీడీపీ వృద్ధిరేటు ప్రతికూలంగా ఉండొచ్చన్న ఆర్​బీఐ ప్రకటనతో దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఆర్​బీఐ నిర్ణయం తీసుకున్నప్పటికీ... అది మదుపరులను ఏ మాత్రం సంతృప్తి పరచలేకపోయింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ ఏ మేర నష్టపోయాయంటే..?

నిప్పు.. నీరు కలిస్తే ఓ ట్రెండ్

న్యూజిలాండ్ కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​తో కోహ్లీకి మంచి అనుబంధం ఉంది. మైదానంలోనే కాకుండా బయట వీరిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. ఇరువురు కలిసున్న ఫొటోను తాజాగా ఇన్​స్టాలో పంచుకున్నాడు విరాట్​. దీనిపై పలువురు నెటిజన్లు ఎలా స్పందించారంటే..?

వేటూరికి బాలు గిఫ్ట్​

ఈరోజు ప్రముఖ గేయ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి వర్ధంతి సందర్భంగా ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు గాయకుడు బాల సుబ్రహ్మణ్యం.ఆ పాట ఏంటో మీరు ఓసారి చూడండి?

ABOUT THE AUTHOR

...view details