తెలంగాణ

telangana

By

Published : May 22, 2020, 2:58 PM IST

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ ​@ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top 10 News @ 3PM
టాప్​ 10 న్యూస్ ​@ 3PM

షెడ్యూల్​ విడుదల

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్​ 8వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని పూర్తి వివరాలు ఇలా...

ఆ బావిలో 9 మృతదేహాలు..

వరంగల్ గ్రామీణ‌ జిల్లావలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో ఇవాళ ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఆ బావిలో తొమ్మిది శవాలు దొరికాయి. అసలు ఆ మృతదేహాలు ఎవరివి?

సొంతపార్టీ వాళ్లకే కేటీఆర్​ ఫైన్​..

హైదరాబాద్​ ఎర్రగడ్డ కార్పొరేటర్​ దంపతులకు మంత్రి కేటీఆర్​ భారీగానే జరిమానా వేశారు. అసలు వాళ్లిద్దరు మంత్రికి ఆగ్రహం తెప్పించేలా ఏం చేశారంటే...?

సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణ

ఏపీ విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ అరెస్ట్ వ్యవహారంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అరెస్టు జరిగిన తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. దాని పూర్తి వివరాలు ఇలా...

బంగాల్​కు రూ.1000 కోట్లు

ప్రధాని నరేంద్ర మోదీ తుపాను​ ధాటికి దెబ్బతిన్న బంగాల్​కు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డవారికి ఎంత ప్రకటించారంటే..?

జయలలిత ఇల్లుపై ఆర్డినెన్స్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా అధీనంలోకి తీసుకునేందుకు అధికారం కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు ఆ రాష్ట్ర గవర్నర్​ బన్వరీలాల్​ పురోహిత్. త్వరలోనేఈ నివాసాన్ని ఇలా మార్చనున్నారు.

భారత్‌పై చైనా కుట్ర!

భారత్ సహా పొరుగు దేశాలతో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా ఓ నివేదికలో వెల్లడించింది. ఇంకా ఆ నివేదికలో ఏం అంశాలు ఉన్నాయంటే..?

వడ్డీ రేట్లు తగ్గింపు

కరోనా దెబ్బతో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించేలా ఆర్​బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. దాని వివరాలు ఎలా ఉన్నాయంటే..?

గంగూలీకి తప్పని​ కష్టాలు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీకి అంపన్​ తుపాను కష్టాలు తప్పలేదు. కోల్​కతాలో ఉండే గంగూలీకి ఏం కష్టాలు వచ్చాయంటే...?

ఆ చిత్రాల మధ్య యుద్ధం?

కరోనా లాక్​డౌన్ కారణంగా థియేటర్లు తెరచుకోవడానికి ఇంకా రెండు మూడు నెలల సమయం పట్టేలా ఉంది. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్, అక్షయ్​ల చిత్రాలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలు ఏంటంటే?

ABOUT THE AUTHOR

...view details