తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-10-news-at-1pm
టాప్​ 10 న్యూస్​@ 1PM

By

Published : Jun 11, 2020, 1:03 PM IST

  • వెనక్కి తగ్గబోమంటున్న జూడాలు

జూనియర్‌ వైద్యుల ఆందోళన మూడో రోజూ కొనసాగుతోంది. మంగళవారం రాత్రి 7 గంటలకు విధులు బహిష్కరించిన జూడాలు... ఇంకా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం... క్లిక్​ చేయండి.

  • సర్కార్​ ప్రణాళికలు

హైదరాబాద్‌లో వ్యవసాయ, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల సమన్వయ సమావేశం జరిగింది. మంత్రి నిరంజన్‌రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో ఉపాధి హామీ నిధులతో వ్యవసాయ కల్లాలు నిర్మించుకునే పనుల విషయంపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏపీలోకరోనా ఉద్ధృతి

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 135 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 38 మందికి, విదేశాల నుంచి వచ్చిన మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలు ఇలా..

  • తిరుమల దర్శనాలు

చాలా రోజుల తర్వాత సాధారణ భక్తులు తిరుమలేశుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా 3 వేల మంది భక్తులకు, టైంస్లాట్​ టోకెన్ల ద్వారా 3 వేలమందికి శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. పూర్తి కథనం కోసం...

  • మోదీ ఉద్బోధ

భారత్ ప్రస్తుతం కరోనానే కాకుండా మిడతలు, తుపాన్లు సహా అనేక సమస్యలు ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొంటూ ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాల్సిన సమయమిదేనని మోదీ పిలుపునిచ్చారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95వ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. ఇంకా ఏం సూచనలు చేశారంటే..?

  • పాక్​ దుశ్చర్య..

కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్​ తూట్లు పొడుస్తూ.. వరుసగా నాలుగోరోజు జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ, పూంఛ్​ జిల్లాల్లో సరిహద్దు వెంబడి కాల్పులు చేపట్టింది. ఈ ఘటనలో భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం...

  • అమెరికా పునరాగమనం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. ఉద్యోగాలు లభించడం మొదలయ్యాయని, స్టాక్​ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయని తెలిపిన ట్రంప్​.. ఆర్థికపరంగా అదిరిపోయే పునరాగమనం చేయడానికి అమెరికా సిద్ధపడుతున్నట్టు ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఏం చెప్పారంటే..?

  • ఆండ్రాయిడ్​ 11 వచ్చేసింది

ఆండ్రాయిడ్‌ నుంచి 11వ వెర్షన్‌ బీటాను తాజాగా విడుదల చేసింది గూగుల్​. అయితే ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే ఇది అందుబాటులోకి వచ్చింది. అది ఎవరు వాడొచ్చంటే...?

  • దేవుడికి షేక్ హ్యాండ్​

మాస్టర్ బ్లాస్టర్ సచిన్​తో తన తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్న మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. అతడిని కలిసినప్పుడు దేవుడితో కరచాలనం చేసినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ఇంకా ఏం చెప్పారంటే..?

  • బిగ్​బీ ఉదారత..

బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​ మరోసారి తన దయాగుణాన్ని చాటారు. లాక్​డౌన్​ కారణంగా ముంబయిలో చిక్కుకున్న వలస కార్మికులకు.. ఓ ప్రత్యేక విమానం ఏర్పాటుచేసి వారిని సొంత రాష్ట్రాలకు చేర్చారు. పూర్తి వివరాల కోసం.. క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details