తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-10-news-at-11am
top-10-news-at-11am

By

Published : Jun 11, 2020, 11:00 AM IST

  • కాంగ్రెస్ నేతల నిర్బంధం

కాంగ్రెస్ చలో సెక్రటేరియేట్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పలువురు కాంగ్రెస్ ప్రముఖులను గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం...

  • కూంబింగ్​లో ఆయుధాలు స్వాధీనం

వరంగల్ గ్రామీణం జిల్లా ఖానాపురం మండలం కీర్యా తండావద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. 3 నాటు తుపాకులు, 56 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం...

  • అరగంటలో రిజల్ట్​

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అరగంటలో కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించే విధానాన్ని హైదరాబాద్​ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆర్​టీ లాంప్ అనే నూతన పరీక్షా విధానాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం...

  • బోన భాగ్యం లేనట్లే!

పోతరాజుల వేషాలు.. శివసత్తుల నృత్యాలు..ఆడబిడ్డల మొక్కులు.. డప్పుల చప్పుళ్లు.. ఏటా భాగ్యనగరంలో బోనాల సందడే వేరు. ఆషాఢం తెచ్చే ఈ ఆధ్యాత్మిక వేడుకలు గోల్కొండ, సికింద్రాబాద్‌, బల్కంపేట, లాల్‌దర్వాజ.. ఇలా ప్రతి చోట ఖ్యాతిని తీసుకొచ్చాయి. ఆ సందడి ఈ ఏడాది లేనట్లే.ఎందుకంటే..?

  • ఏనుగు మృతి కేసులో ముగ్గురు అరెస్టు


కేరళ కొల్లం జిల్లాలో ఏనుగు మృతికి కారణమైన ముగ్గురిని అరెస్టు చేశారు ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులు. పాలక్కాడ్ గర్భవతి ఏనుగు మృతి బాధ్యుల కోసం వెతుకుతుండగా వీరు తమకు చిక్కినట్లు చెప్పారు. పూర్తి కథనం కోసం...

  • 'భాజపా ఎరవేస్తోంది'

రాజస్థాన్​ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు.ఇంకా ఆయన ఏం చెప్పారంటే..?

  • ట్రంప్ ప్యూహాం

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ ప్రత్యేకమే. 2016లో జరిగిన ఎన్నికల్లో 'అమెరికా ఫస్ట్' నినాదంతో అనూహ్య విజయం సాధించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో మళ్లీ పాత వ్యూహాలకు పదును పెడుతున్నారు ట్రంప్. అవి ఏంటంటే..?

  • పెరిగిన చమురు ధరలు

ఆయిల్ కంపెనీలు వరుసగా ఐదో రోజు చమురు ధరలు పెంచాయి. ఇవాళ పెట్రోల్, డీజిల్​ ధరలు లీటర్​కు 60 పైసలు చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలు ఇలా...

  • 'ఐపీఎల్​కు సిద్ధంకండి'

ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్​ ఉంటుందని చెప్పిన గంగూలీ.. రాష్ట్రాలు అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. త్వరలో టోర్నీ నిర్వహణపై స్పష్టతనిస్తామని చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే..?

  • బైక్​పై ప్రియుడితో శ్రద్ధా

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ శ్రద్ధా కపూర్​ తన ప్రియుడు రోహన్​ శ్రేష్టతో కలిసి రోడ్లపై స్కూటీతో షికార్లు కొట్టింది. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కి, ప్రస్తుతం వైరల్​గా మారింది. అదేంటో మీరు చూడండి.

ABOUT THE AUTHOR

...view details