తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 10AM - Top 10 News @ 10AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Top 10 News @ 10AM
ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : May 25, 2020, 10:04 AM IST

భారత్​ రికార్ట్​:

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,977 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 154 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు. పూర్తి వివరాల కోసం...

కొవిడ్‌ కోరల్లో ప్రపంచం

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 85 వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. మొత్తం కేసుల వివరాలు ఎలా ఉన్నాయంటే..?

చుట్టుముడుతోంది!

భాగ్యనగర వ్యాప్తంగా కొవిడ్​ వైరస్​ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదివారం 23 కేసులు నమోదయ్యాయి. మొత్తం నగరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

నింగిలోకి విమానాలు

దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. దిల్లీ-పుణె, ముంబయి-పట్నా విమాన సర్వీసులు మొదటిగా ప్రారంభమయ్యాయి. ఇంకా ఎక్కడెక్కడా ప్రారంభమయ్యాయంటే..?

వీడిన మిస్టరీ

గొర్రెకుంట బావి మృతదేహాల మిస్టరీ వీడింది. 9 మంది మరణానికి బిహార్​కు చెందిన సంజయ్ కుమార్ యాదవే కారణమని... పోలీసుల విచారణలో వెల్లడైంది.హత్యలు చేయడానికి అసలు కారణం ఏంటంటే?

'నాకు రక్షణ కల్పించండి'

ఓ ఎమ్మెల్యే కుమారుడు తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని... పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదంటూ మంత్రి సత్యవతి రాఠోడ్​ వద్ద గోడు వెల్లబోసుకుందో మహిళ. అసలు ఏం జరిగిందంటే..?

'ఈద్​'​ వేడుకలు

దేశవ్యాప్తంగా ఈద్​​ వేడుకలు కొనసాగుతున్నాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు ముస్లింలు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకుంటున్నారంటే..?

అమరావతికి చంద్రబాబు

విశాఖ పర్యటన వాయిదా పడటం వల్ల తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్​ నుంచి నేరుగా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. పూర్తి వివరాల కోసం...

బల్బీర్ ​సింగ్ ఇకలేరు

భారత హాకీ లెజెండ్​ బల్బీర్​ సింగ్​ కన్నుమూశారు. ఈ నెల 8న మొహాలిలోని ఫోర్టిస్​ ఆస్పత్రిలో చేరిన ఆయన అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఈరోజు ఉదయం 6.30కు తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం...

ఇక క్లాప్​ కొట్టేద్దామా!

చిత్ర పరిశ్రమ సినిమాల్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. జూన్‌ నుంచి చిత్రీకరణలకి అనుమతులు రానుండటం వల్ల చిత్రసీమలో కదలిక మొదలైంది. ఇక సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కనున్నాయంటే..?

ABOUT THE AUTHOR

...view details