ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 5 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వచ్చే వాహనాలు కవాడిగూడ వైపు... ఆర్టీసీ క్రాస్‌రోడ్డు నుంచి ఇందిరాపార్కు వచ్చే వాహనాలు అశోక్‌నగర్ వైపు వెళ్లాలని సూచించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్లే వాహనాలు ఇతర మార్గాల్లో పయనించాలన్నారు.
ట్యాంక్‌బండ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు... - రేపు ట్యాంక్‌బండ్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆర్టీసీ ఐకాస తలపెట్టిన మిలియన్ మార్చ్ నేపథ్యంలో భాగ్యనగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Tomorrow Traffic restrictions at Hyderabad
హిమాయత్‌నగర్ నుంచి ట్యాంక్‌బండ్ వచ్చే వాహనాలు బషీర్‌బాగ్ వైపు... ఓల్డ్ ఎమ్మెల్యే రూట్ నుంచి వచ్చే వాహనాలను పీవీఆర్ జంక్షన్ దగ్గర దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వచ్చే వాహనదారులు... ఇందిరాగాంధీ విగ్రహం నెక్లెస్ రోడ్, మింట్ కాంపౌండ్ వైపు వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి:'ఆర్టీసీ మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయండి'
Last Updated : Nov 9, 2019, 7:58 AM IST