తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మో చలాన్లు... నేడు లారీల బంద్​.. - తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్

కేంద్రం తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టం ద్వారా ఊహించని రీతిలో విధిస్తున్న జరిమానాలకు వ్యతిరేకంగా ఏఎంటీసీ గురువారం బంద్​కు పిలుపునిచ్చింది. నేడు ఒక్కరోజు దేశవ్యాప్తంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.

రేపు లారీల బంద్​

By

Published : Sep 18, 2019, 5:44 PM IST

Updated : Sep 19, 2019, 6:08 AM IST

ఆలిండియా మోటార్ ట్రాన్స్​పోర్ట్ కాంగ్రెస్ (ఏఎంటీసీ) ఆదేశాల మేరకు ఇవాళ తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఒక్కరోజు బంద్​కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటారు వాహన చట్టానికి వ్యతిరేకంగా బంద్​ నిర్వహిస్తున్నట్లు లారీ ఓనర్స్​ అసోసియేషన్ స్పష్టం చేసింది. కొత్త చట్టం ద్వారా ఊహించని రీతిలో జరిమానాలు విధించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఈ బంద్​కు సంపూర్ణ మద్దతునిస్తుందని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్​రెడ్డి, దుర్గా ప్రసాద్​ తెలిపారు.

దేశవ్యాప్తంగా బంద్​...

నూతన మోటారు వాహన చట్టం ద్వారా కార్మికులు, లారీ యజమానులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో గురువారం ఉదయం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకు ఎలాంటి రవాణా చేయొద్దని ఏఎంటీసీ నిర్ణయించిందని పేర్కొన్నారు. వారి నిర్ణయం మేరకు రాష్ట్రంలో కూడా బంద్ తలపెట్టామని తెలిపారు. అత్యవసర సరుకుల రవాణాకు కూడా నేడు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రజలు ఒక్కరోజు బంద్​కు సహకరించాలని వారు కోరారు.

రేపు లారీల బంద్​

ఇవీ చూడండి: గోదావరిలో.. 80 మీటర్ల లోతులో బోటు..!

Last Updated : Sep 19, 2019, 6:08 AM IST

ABOUT THE AUTHOR

...view details