దోస్త్ ద్వారా విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చేరేందుకు గడువును రేపటి వరకు పొడిగించారు. ఇవాళే గడువు ముగిసినప్పటికీ... శుక్రవారం కూడా అవకాశం కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షా 15 వేల 428 మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాల అనంతరం ప్రత్యేక విడత ఉంటుందన్నారు. ఇప్పటి వరకు దోస్త్లో నమోదు చేసుకోని వారితో పాటు... వెబ్ ఆప్షన్లు ఇవ్వని వారికి, సీటు దక్కని వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపారు.
సీటు వచ్చినప్పటికీ కాలేజీలో చేరని వారి వివరాలు దోస్త్ నుంచి తొలగిస్తామన్నారు. ప్రత్యేక విడతలో పాల్గొనాలంటే రూ.400 రూపాయలు చెల్లించి మళ్లీ నమోదు చేసుకోవాల్సిందేనని కన్వీనర్ స్పష్టం చేశారు. కళాశాలలో చేరిన వారు మరింత మంచి సీటు కావాలనుకుంటే ఇప్పటికే ఇచ్చిన ఐచ్ఛికాలనే పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తాజాగా వెబ్ ఆప్షన్లు ఇవ్వడం కుదరదని పేర్కొన్నారు.
డిగ్రీ కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు గడువు పొడిగింపు - STUDENTS REPORTING
డిగ్రీ విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో చేరేందుకు శుక్రవారం చివరి తేదీగా నిర్ణయించారు. ప్రత్యేక విడతలో పాల్గొనాలంటే రూ.400 రూపాయలు చెల్లించి మళ్లీ నమోదు చేసుకోవాల్సిందేనని దోస్త్ కన్వీనర్ స్పష్టం చేశారు.
కళాశాలల్లో చేరేందుకు శుక్రవారం చివరి తేదీగా నిర్ణయించిన దోస్త్
ఇవీ చూడండి : కపాళిని అవతారంలో భద్రకాళి దర్శనం
Last Updated : Jul 5, 2019, 8:39 AM IST