ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఇవాళ ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇంటీరియర్ కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - Rains in Telangana state
ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు
Last Updated : Sep 25, 2019, 9:15 PM IST