ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ బుధవారం ఉదయం 11 గంటలకు కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌తో పాటు పలువురు ఏపీ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
రేపు ఏపీ ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు ఆదేశాలు - ap local polls 2021notifications
సుప్రీంకోర్టు తీర్పుతో ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. బుధవారం ఉదయం 11గంటలకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ సమావేశం కానుంది. ఈ సమీక్షకు అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకావాలని ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
![రేపు ఏపీ ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు ఆదేశాలు tomorrow-ap-sec-to-hold-video-conference-with-district-collectors-and-sps](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10387224-835-10387224-1611652976485.jpg)
రేపు ఏపీ ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్.. కలెక్టర్లకు ఆదేశాలు
ఏపీ స్థానిక ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్లు, ఓటర్ల జాబితా రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించనున్నారు. ఈ సమీక్షకు హాజరుకావాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:సుప్రీం తీర్పు వైకాపా ఉన్మాద పాలనకు కనువిప్పు కావాలి: చంద్రబాబు