బుధవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 160 మండలాల్లో 26,851 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూడో విడత 3,221 పంచాయతీలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 579 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమవ్వగా.. రేపు 2,639 సర్పంచి స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 2,639 పంచాయతీలకు 7,757 మంది సర్పంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రేపు మూడో దశ పంచాయతీ ఎన్నికలు - ap panchayth elections arrangements
ఆంధ్రప్రదేశ్‌లో మూడో దఫా పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. 160 మండలాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్ జరగనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీకే ద్వివేది తెలిపారు.
మూడో విడత 31,516 వార్డుల్లో 11,753 స్థానాలు ఏకగ్రీవమవ్వగా.. 19,553 వార్డు స్థానాలకు పోటీ జరగనుంది. 43,162 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్ జరగనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీకే ద్వివేది స్పష్టం చేశారు. మొత్తం 4,118 సమస్యాత్మక, 3,127 అతి సమస్యాత్మక కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. మూడో విడతలో 55 లక్షల 75 వేల ఓటర్లు.. ఓటు వేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు.
ఇదీ చదవండి:బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ ఫిర్యాదులు స్వీకరించాలి: ఏపీ ఎస్ఈసీ