నగరంలోని హోల్‌సేల్ మార్కెట్లకు నిత్యం 9 వేల బాక్సుల్లో 2.25 లక్షల కేజీల టమాట వచ్చేది. అప్పుడు రూ.15లోపే రైతు బజారులో దొరుకుతుండేది. ప్రస్తుతం కేవలం 3 వేల టమాట బాక్సులు మాత్రమే వస్తున్నాయి. అంటే 75 వేల కేజీలు మాత్రమే చేరుతున్నాయి. ఇంత తక్కువ టమాటా రావడం ఇదే ప్రథమమని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా అంకాపూర్ నుంచి 30 శాతం టమాట వస్తోంది. మిగతా 70 శాతం రాజస్థాన్‌లోని జోద్‌పూర్, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వస్తోంది. అక్కడ 25 కిలోల బాక్సు రూ.1,500 ఉండగా.. అంకాపూర్ నుంచి వచ్చే బాక్సు రూ.1,150 పలుకుతోంది. దీంతో రైతుబజారులోనే కిలో టమాటా రూ.50 అయ్యిందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలో మదనపల్లి, అనంతపురం నుంచి విరివిగా టమాట నగరానికి వచ్చేది. ఇప్పుడది బెంగళూరు, తమిళనాడుతో పాటు శ్రీలంకకు ఎగుమతి అవుతోంది.
నువ్వా-నేనా.. పోటాపోటీగా టమాట, చికెన్ ధరలు - చికెన్ ధరలు
మార్కెట్లో ప్రస్తుతం టమాట ధరలు సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి సతమతమవుతుండగా.. టమాట సైతం పోటీలోకి వచ్చింది. మరోవైపు మాంసం ప్రియులకు చికెన్ ధరలు షాక్ కొట్టిస్తున్నాయి. కిలో చికెన్ ఏకంగా మూడు వందలకు పైగా ఎగబాకింది. ధరల విషయంలో చికెన్, టమాట పోటీ పడుతున్నాయి.
![నువ్వా-నేనా.. పోటాపోటీగా టమాట, చికెన్ ధరలు Tomato VS Chicken](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15296455-490-15296455-1652670764897.jpg)
పోటాపోటీగా టమాట, చికెన్ ధరలు
అన్నిటికీ రంగు, రుచి, వాసన అందించే టమాటా.. ఆదివారం వస్తే పొరుగు ఇంటి వరకూ వంటింటి వాసన వచ్చే కోడి కూర.. సామాన్యులకు అందకుండా పోతున్నాయి. కోడిగుడ్డుతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. కిలో టమాట ధర నగరంలో రూ.80 పలికితే.. చికెన్ ధర రూ.310 నుంచి రూ.320 వరకు పలుకుతుంది. ఎండల ప్రభావం ఈ రెండింటిపైనా పడింది. తెలంగాణలో టమాట సాగు దాదాపుగా ఖాళీ అయితే.. కోళ్ల ఫారాల సంఖ్య సగానికి తగ్గిపోయింది. దీంతో వీటి ధర ఆకాశాన్ని అంటుతోంది.
Last Updated : May 16, 2022, 10:48 AM IST