విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోన్న నటకిరిటీ రాజేంద్రప్రసాద్ మరో సరికొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యువ దర్శకుడు విశ్వనాథ్ మాగంటి దర్శకత్వంలో సుమ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న 'తోలుబొమ్మలాట' చిత్రంలో తాత పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ను హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేశారు. రాజేంద్రప్రసాద్ తోపాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరై చిత్ర విశేషాలను వెల్లడించారు. మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలను చాటేలా తోలుబొమ్మాలాట ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరవుతుందని రాజేంద్రప్రసాద్ తెలిపారు. విశ్వంత్, హర్షిత హీరోహీరోయిన్లుగా నటించగా... వెన్నెల కిషోర్, దేవీ ప్రసాద్, నర్రా శ్రీనివాస్, నారాయణరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
బంధాలు, అనుబంధాల ఆటే... 'తోలుబొమ్మలాట' - వెన్నెల కిషోర్
నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న తోలుబొమ్మలాట చిత్రం మోషన్ పోష్టర్ విడుదలైంది. హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర బృదం పాల్గొని తోలుబొమ్మలాట విశేషాలు పంచుకున్నారు.
TOLUBOMMALATA_MOTION_POSTER_LAUNCH_BY_ RAJENDRAPRASAD