తెలంగాణ

telangana

ETV Bharat / state

Today Weather: ఈనెల 29న అల్పపీడనం.. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు! - weather updates of ap

AP Weather News Today: ఈనెల 29నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో నేడు ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి మోస్తరు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

AP Weather News Today, ఏపీలో వెదర్ అప్​డేట్స్
ఏపీలో వెదర్ అప్​డేట్స్

By

Published : Nov 26, 2021, 9:21 AM IST

AP Weather News Today: రాయలసీమ జిల్లాలు వరద ముప్పు నుంచి తేరుకోకమునుపే అల్పపీడనం(today weather updates of ap) రూపంలో మరో గండం వెంటాడుతోంది. ఈనెల 29నాటికి దక్షిణ అండమాన్‌ వద్ద బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆ తరువాత 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించొచ్చని అంచనా వేస్తున్నారు. 26న ఉత్తర కోస్తాలో తేలికపాటినుంచి మోస్తరు.. ఒకటి, రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

దక్షిణ కోస్తా, రాయలసీమ(ap weather news) జిల్లాల్లో తేలికపాటి వర్షాలతోపాటు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని అంచనా. 27న ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలతోపాటు ఉరుములతో కూడిన జల్లులు పడనున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల పడనున్నాయి. 28వ తేదీన ఏపీ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది.

ఇదీ చదవండి..:Earthquake: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్​పై 6.1 తీవ్రత

ABOUT THE AUTHOR

...view details