Weather update in Telangana: మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఉంది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి.
చురుగ్గా రుతుపవనాల కదలిక.. రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు - rains in Telangana today
Weather update in Telangana: తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు
అత్యధికంగా అశ్వాపురం(భద్రాద్రి జిల్లా)లో 10 సెంటీమీటర్లు, జూలూరుపాడులో 8.5, మంచిప్ప(నిజామాబాద్)లో 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెం.మీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్‌మెట్‌లో 5.4, అల్వాల్ కొత్తబస్తీ 5.3, కంది 5, మహేశ్‌నగర్‌లో 4.4 సెం.మీ.వర్షం కురిసింది.