తెలంగాణ

telangana

ETV Bharat / state

Temperature in TS: తగ్గని భానుడి ప్రతాపం.. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు - తెలంగాణ తాజా వార్తలు

Temperature in TS: రాష్ట్రంలో ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ అత్యధికంగా పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్​కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉష్ణోగ్రతలు
ఉష్ణోగ్రతలు

By

Published : Jun 5, 2022, 6:35 PM IST

Temperature in TS: రాష్ట్రంలో భానుడి భగభగలు ఇంకా తగ్గడం లేదు. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లలేక ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. తాజాగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లా, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాల్లోని పలు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా..: నల్గొండ జిల్లా కేతేపల్లి, పెద్దావూర మండలాల్లో అత్యధికంగా 45.5డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో 45.3.. జగిత్యాల జిల్లా వెలగటూరు, నల్గొండ జిల్లా నిడమనూరు, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల్లాలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details