తెలంగాణ

telangana

ETV Bharat / state

weather report: రాష్ట్రంలో పొడి వాతావరణం..! - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణ ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది (weather report). శనివారం నుంచి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

weather report
weather report

By

Published : Oct 28, 2021, 11:01 PM IST

రాష్ట్రంలో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది (weather report). శనివారం నుంచి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు (telangana weather update). ఈ రోజు కిందిస్థాయి గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా వీస్తున్నాయన్నారు.

బుధవారం.. మధ్య దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఇవాళ శ్రీలంక తీరంలోని ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద కొనసాగుతూ ఉందని తెలిపారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి సుమారు 3.1 కీమీ ఎత్తు వరకు వ్యాపించిందని... ఇది రాగల 48 గంటలలో పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు. తూర్పు గాలులలో ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు శ్రీలంక తీరంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం నుంచి వాయువ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపారు.

ఇదీ చూడండి:Tragedy : ఒకే వీధిలో ముగ్గురు యువతులు అదృశ్యం.. చెరువులో ఇద్దరి మృతదేహాలు

ABOUT THE AUTHOR

...view details