తెలంగాణలోకి నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని.. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం - తెలంగాణ వాతావరణ సమాచారం
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని.. గాలిలో తేమ సాధారణం కన్నా 18 శాతం పెరిగిందని పేర్కొంది.
బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 119 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా గార్ల (మహబూబాబాద్ జిల్లా)లో 2.5 సెంటీమీటర్లు, ఖమ్మం పట్టణంలో 2.3, మేళ్లచెరువు (సూర్యాపేట)లో 1.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. గాలిలో తేమ సాధారణం కన్నా 18 శాతం పెరిగిందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:రోగ నిరోధక శక్తి బాగుంటే బ్లాక్ ఫంగస్ రాదు: డాక్టర్ శంకర్ ప్రసాద్