తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. బలహీనపడి వాయుగుండంగా మారినట్లు పేర్కొంది. దీంతో రాగల రెండ్రోజులు ఒకట్రెండు చోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది.
రాగల 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం! - రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. బలహీనపడి వాయుగుండంగా మారినట్లు పేర్కొంది.
మోస్తరు వర్షాలు
ఉత్తర ఛత్తీస్గఢ్, మధ్య ఒడిశా వద్ద కేంద్రీకృతమైన వాయుగుండం... రాగల 48 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి కిందస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది.
ఇదీ చూడండి:Missing: నాలుగేళ్ల కుమారుడితో సహా తండ్రి అదృశ్యం!