Weather in TS: రాష్ట్రంలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిస్తాయని పేర్కొంది.
సోమవారం ఉపరితల ద్రోణి దక్షిణ ఛత్తీశ్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిమీ ఎత్తు వద్ద కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.