రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. దక్షిణ తమిళనాడు నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఇంటీరియర్ కర్ణాటక, మరఠ్వాడ, విదర్భ మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
మరఠ్వాడలో ఉపరితల ఆవర్తనం... నేడు, రేపు రాష్ట్రంలో వర్షం! - RAIN IN TELANAGANA
మరఠ్వాడ దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
![మరఠ్వాడలో ఉపరితల ఆవర్తనం... నేడు, రేపు రాష్ట్రంలో వర్షం! rain in telanagana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6011270-69-6011270-1581230075684.jpg)
నేడు, రేపు రాష్ట్రలో వర్షం కురిసే అవకాశం