'ఆర్టీసీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి'
ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ, ప్రభుత్వ వైఖరి, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఆర్టీసీ సమ్మె విరమణ, ప్రభుత్వ వైఖరి, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. హైదరాబాద్ గోల్కొండ హోటల్లో తెజస అధ్యక్షడు ఆచార్య కోదండరాం నేతృత్వంలో జరగుతున్న సమావేశానికి కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్ రెడ్డి, భాజపా నేత మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోదండరాం తెలిపారు.