రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత తమిళిసై సౌందర్‌రాజన్ రెండో గవర్నర్ కావడం విశేషం.
షెడ్యూలు ఇలా...
రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందర్‌రాజన్ చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 8 గంటల 50 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు తమిళిసైకి స్వాగతం పలుకుతారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్... తమిళిసై సౌందరరాజన్ ఆమెతో ప్రమాణం చేయిస్తారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తమిళిసై ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమం జరిగే సమయంలో రాజ్‌భవన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
ఇవాళ నూతన గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న తమిళిసై ఇదీ చూడండి : రేపు మంత్రివర్గ విస్తరణ.. కేటీఆర్, హరీశ్‌కు బెర్త్ ఖాయం!