రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న నమోదైన కేసులతో పోలిస్తే ఇవాళ స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,20,165 నమూనాలను పరీక్షించగా 746 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,37,373 కి చేరింది. కరోనా మహమ్మారి కారణంగా తాజాగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,764కి పెరిగింది.
Corona Cases: కొత్తగా 746 మందికి వైరస్.. మరో ఐదు మరణాలు - కొత్త నమోదైన కేసులు
రాష్ట్రంలో కొత్తగా 746 కరోనా కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 729 మంది బాధితులు కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,20,165 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,836 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కొత్తగా 746 కరోనా కేసులు
తాజాగా మరో 729 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9,836 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 71 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల రేటు 0.59 శాతం కాగా.. రికవరీ రేటు 97.86 శాతంగా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది.
ఇదీ చూడండి: