రాష్ట్రంలో క్రమంగా కరోనా రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో 765 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ కరోనా నుంచి మరో 648 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,609 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 35,094 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీలో కొత్తగా 356 కరోనా కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల పెరుగుదలతో మళ్లీ వైరస్ విజృంభిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
corona cases: మళ్లీ విజృంభిస్తున్న వైరస్.. కొత్తగా 765 కరోనా కేసులు - corona cases in teangana
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. రోజురోజుకు కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మరో 765 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
corona cases in ts