నేడు భారీగా నామినేషన్ ఉపసంహరణలు! పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ఇవాళ పూర్తి కానుంది. 9 నగర పాలక, 120 పురపాలక సంస్థల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. 3,052 వార్డులకు గాను 25వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పరిశీలన ప్రక్రియ అనంతరం 25 వేల 336 నామపత్రాలు సరిగ్గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో నిన్న కొందరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
ఒకే పార్టీ తరఫున అధికంగా అభ్యర్థులు..
ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలతో పాటు పూర్తి కానుంది. ఇవాళ భారీ సంఖ్యలో ఉపసంహరణలు జరిగే అవకాశం కనిపిస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్నా చాలా స్థానాల్లో ఒకే పార్టీ తరఫున ఒకరి కంటె ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో చివరగా ఒక్కరే పోటీలో మిగలాల్సి ఉంటుంది. అధికార తెరాసలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. పార్టీ అధికారిక అభ్యర్థిగా ఉండాలంటే పార్టీ బీఫారాన్ని ఉపసంహరణ గడువు ముగిసే లోగా ఇవ్వాల్సి ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా పార్టీల అభ్యర్థుల విషయానికి సంబంధించి పూర్తి స్పష్టత వస్తుంది.
ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసి గుర్తులు కేటాయిస్తారు. అటు కరీంనగర్ కార్పోరేషన్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు 16తో ముగియనుంది.
ఇవీ చూడండి: గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం