తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నెల 13న ఉగాదిని పురస్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు. ఉదయం 11 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయశుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - tirumala latest news
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయాన్ని శుద్ధి చేసి, పరిమళ జలంతో మందిరంలో సంప్రోక్షణం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
తిరుమల
ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకుని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి వంటి అన్ని వస్తువులను శుద్ధి చేస్తారు. ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
ఇదీ చదవండి:బెంగళూరు డ్రగ్స్ కేసు: రాష్ట్ర రాజకీయాల్లో మొదలైన ప్రకంపనలు!