తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో ఇవాళ నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్‌ పక్కన నిర్వహించనున్నారు. ఉదయం జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి అంతిమయాత్ర మొదలు కానుంది. అనంతరం గాంధీభవన్‌లో కొంతసమయం పాటు అభిమానుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఉంచనున్నారు.

By

Published : Jul 29, 2019, 2:48 AM IST

Updated : Jul 29, 2019, 11:46 AM IST

ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి స్వయంగా పర్యవేక్షించనున్నారు. అంతిమయాత్ర, అంత్యక్రియల్లో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, గులాంనబీ ఆజాద్​తో పాటు పలువురు నాయకులు పాల్గోనున్నారు. భారీ సంఖ్యలో నేతలు జైపాల్‌ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొంటున్నందున పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

అంతిమయాత్ర సాగుతుందిలా...

ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమయ్యే అంతిమయాత్ర 10 నుంచి 10.30గంటల ప్రాంతంలో గాంధీభవన్‌ చేరుకుంటుంది. అక్కడ జైపాల్‌ రెడ్డి పార్థివదేహాన్ని గంట నుంచి గంటన్నరపాటు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి ప్రారంభమయ్యే అంతిమయాత్ర...నేరుగా నెక్లెస్‌ రోడ్డులోని పీవీఘాట్‌ వద్దకు చేరుకుంటుంది. అంత్యక్రియలు పూర్తియ్యేటప్పటికి మధ్యాహ్నం ఒంటిగంట కావచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చూడండి: జననేత జైపాల్​ రెడ్డికి అశ్రునివాళి

Last Updated : Jul 29, 2019, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details