తెలంగాణ

telangana

ETV Bharat / state

Hanuman Sobhayatra: నేడు హనుమాన్​ జయంతి.. శోభాయాత్రలకు పటిష్ఠ బందోబస్తు - Hanuman shobhayatra

నేడు ఆంజనేయుడి జయంతి సందర్భంగా.. శోభాయాత్రలతో వీధులు భక్తజన సంద్రంగా మారనున్నాయి. జంట నగరాలతో పాటు జిల్లాల్లో పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా భారీగా బలగాలను మోహరిస్తున్నారు.

నేడు హనుమాన్​ జయంతి.. శోభాయాత్రలకు పటిష్ఠ బందోబస్తు
నేడు హనుమాన్​ జయంతి.. శోభాయాత్రలకు పటిష్ఠ బందోబస్తు

By

Published : Apr 16, 2022, 4:59 AM IST

హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గౌలిగూడలోని రామమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకూ ప్రధాన శోభాయాత్ర కొనసాగుతుంది. కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్ ఆలయం నుంచి తాడ్​బండ్​కి మరో యాత్ర ఉంటుంది. ఈ శోభాయాత్ర 22.5 కిలోమీటర్లు మేర సాగనుంది. శోభాయాత్ర సందర్భంగా.. మొత్తం 21 మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సుమారు 8 వేల మంది పోలీసులు శోభాయాత్ర విధుల్లో పాల్గొంటున్నారు. సుమారు 500ల సీసీటీవీ కెమెరాలు, మూడు డ్రోన్లతో.. శోభాయాత్ర పర్యవేక్షణ చేస్తామని, వీటన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అనుసంధానిస్తామని వివరించారు. శోభాయాత్ర ముందు, వెనక సీసీ కెమెరాలతో ఉన్న మౌంటెండ్ పెట్రోలింగ్ వాహనాలు గస్తీ చేస్తాయని తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

పటిష్ఠ బందోబస్తు..

శోభాయాత్రల సందర్భంగా జిల్లాల్లోనూ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్‌లో హనుమాన్‌ శోభాయత్ర సందర్భంగా పోలీసులు ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. రాష్ట్రమంతా శోభాయాత్రలు ప్రశాంతంగా జరిగేలా చూస్తామని అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details