రాష్ట్రంలో పంపిణీ చేసిన కొవిడ్ టీకాల్లో సగానికి పైగా డోసులను 18-44 మధ్య వారే పొందారు. రాష్ట్రంలో రెండో డోసు స్వీకరించడానికి ముందుకు రానివారు 35 లక్షల మందికి పైనే ఉంటారని అంచనా. వీరందరికీ యుద్ధప్రాతిపదికన టీకా వేసేందుకు వైద్యశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 4న దీపావళి సందర్భంగా టీకాల పంపిణీకి ప్రభుత్వ కేంద్రాలకు సెలవు ప్రకటించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
- రాష్ట్రంలో పంపిణీ చేసిన మొత్తం టీకా డోసులు: 3,28,54,475
- ఇందులో మొదటి డోసు: 2.28 కోట్లు (69.43 శాతం)
- రెండు డోసులు స్వీకరించిన వారూ కోటి దాటారు.
- 18-44 ఏళ్ల మధ్య వారికి అందిన టీకాలు: 1,80,32,845 (54.88 శాతం)
- ఇందులో తొలి డోసు: 1,32,80,939
- రెండు డోసులు: 47,51,906
- 45 ఏళ్ల పైబడినవారికి: 1,36,78,216 (41.63 శాతం)
- మిగిలిన టీకాలను వైద్యసిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వేశారు.
- సర్కారు వైద్యంలో వేసినవి: 2,89,94,601
- ప్రైవేటులో: 38,59,874
ఇదీ చూడండి:రెండు డోసులు తీసుకున్నారా..? అయితే ఈ 'ఫుడ్' ఆఫర్ మీకే!
Prathidwani: కరోనా వైరస్ కట్టడిలో టీకా బూస్టర్ డోస్ పాత్ర ఏంటి?
Vaccination Campaign: రావాలమ్మా రావాలి.. అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి..
అన్ని పరిశీలించాకే కొవాగ్జిన్‌కు అనుమతులిచ్చాం: డబ్ల్యూహెచ్ఓ