మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తత అవసరం - Telangana Meteorological Department Latest News
రాగల 24 గంటలపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.
హెచ్చరిక.. రాగల 24 గంటలు అప్రమత్తంగా ఉండండి'
రాగల 24 గంటల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్ధని సూచించారు.
ఇవీచూడండి:ఓ వైపు వర్షం... మరో వైపు అంధకారం... నగరవాసుల ఇక్కట్ల పర్వం