ఆదివారం వాయువ్య బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈనెల 13న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు - తెలంగాణ వర్ష సూచన తాజా వార్తలు
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈనెల 13న వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి రాజారావుతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
![అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు today Heavy rain across the telangana 13th august Another weather forecast](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8366320-482-8366320-1597059422699.jpg)
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం..13న మరో అల్పపీడనం
ఆదివారం ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయని తెలిపారు. వరంగల్, జగిత్యాల, కరీనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లిలో కూడా మోస్తారు వర్షాలు పడ్డాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 శాతం సాధారణ వర్షపాతం నమోదైందని చెప్పారు. వనపర్తిలో అత్యధికంగా 115 శాతం నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో తక్కువగా 25 శాతం నమోదైందని వెల్లడించారు.
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షం..13న మరో అల్పపీడనం
ఇదీ చూడండి :రాచకొండ పోలీసుల రక్తదాన శిబిరం.. 101 మంది ఔదార్యం..