Today BRS Joinings at Telangana Bhavan: కర్ణాటకలో ఎటు చూసినా కరవే కనిపిస్తోందని.. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా కరవే లేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ములుగు జిల్లాలోని స్థానిక నాయకులు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు(Harish Rao) సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ములుగు జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతిని గెలిపించాలని కార్యకర్తలను కోరారు. బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే లేకుండా ములుగు జిల్లాను అభివృద్ధి చేశామని తెలిపారు. కమలాపూర్ ప్యాక్టరీని తెరిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు.
Harish Rao comments on Karnataka Congress: ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా రెండు పంటలు పుష్కలంగా పండుతున్నాయని హరీశ్‌రావు అన్నారు. ఎకరానికి సుమారు 25-30 క్వింటాల్ వరి పండుతుందని.. ప్రతి గింజను కేసీఆర్(KCR) ప్రభుత్వం కొంటుందని పేర్కొన్నారు. ఛత్తీస్‌ఘఢ్‌లో 13 క్వింటాల్ మాత్రమే కొంటున్నారని.. దీన్ని కాంగ్రెస్ మోడల్‌గా ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలో రూ.72 వేల కోట్లు జమ చేశామని అన్నారు. రాష్ట్రానికి అభివృద్ధి చేసే నాయకులు అవసరమని.. ప్రజలు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దశం చేశారు. ఇటీవల కాలం వస్తున్న అన్ని ఎన్నికల సర్వేల్లో బీఆర్ఎస్గెలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఈసారి ములుగులో బీఆర్ఎస్ జెండా ఎగరడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు.
అధికారంలోకి వస్తే గిరిజన బంధు, పోడు భూముల పట్టాలు ఇస్తాం : హరీశ్‌రావు
Harish Rao Comments on Revanth Reddy: కర్ణాటక రాష్ట్రంలో 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తుందని.. దీన్నే రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మోడల్‌గా తీసుకుంటున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రజలకు 24 గంటలు కరెంట్ కావాలో.. కర్ణాటక మోడల్ కావాలో తేేల్చుకోవాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్(KARNATAKA CONGRESS) నాయకుల చెప్పిన విధంగానే ఇక్కడ ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ గురించి ఆలోచించరని.. కర్ణాటక గురించే ఆలోచిస్తారని పేర్కొన్నారు. వ్యవసాయంపై కనీసం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాట్లాడుతున్నారని ఆరోపించారు.