తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు తెలంగాణ బంద్​కు పిలుపునిచ్చిన భాజపా

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో చోటు చేసుకున్న అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నిమ్స్​లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల అక్రమ అరెస్ట్​లకు నిరసనగా ఈరోజు రాష్ట్ర బంద్​కు పిలుపునిచ్చారు.

By

Published : May 2, 2019, 5:59 AM IST

Updated : May 2, 2019, 11:47 AM IST

నేడు తెలంగాణ బంద్​కు పిలుపునిచ్చిన భాజపా

నేడు తెలంగాణ బంద్​కు పిలుపునిచ్చిన భాజపా

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలను నిరసిస్తూ... నేడు రాష్ట్ర బంద్​కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 29 నుంచి మొదలుపెట్టిన తన నిరవధిక దీక్షను విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఆందోళనలు, నిరసనలను ప్రభుత్వం అప్రజాస్వామికంగా అణచివేస్తోందని... బంద్​ను విఫలం చేయటానికి కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు.

వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

9 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై ప్రభుత్వం ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా సర్కారు మొండి వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. తక్షణమే విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు న్యాయం జరిగేందుకు భాజపా చేపట్టిన రాష్ట్ర బంద్​కు వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని లక్ష్మణ్ కోరారు.

నిమ్స్​లో దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్​కు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్​షా ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చూడండి:అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

Last Updated : May 2, 2019, 11:47 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details