రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు - telangana rain news
తూర్పు మధ్య అరేబియా, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ సముద్ర సమీప ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ రోజు, రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
తూర్పు మధ్య, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇవీ చూడండి:నీటిపారుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష